హన్మకొండ జిల్లా మడికొండ గురుకులంలో కమిషనర్ తనిఖీ

0చూసినవారు
హన్మకొండ జిల్లా మడికొండ గురుకులంలో కమిషనర్ తనిఖీ
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై వీధి కుక్క దాడి ఘటనపై స్పందిస్తూ, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న సోమవారం పాఠశాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, ప్రహరీ నిర్మాణాన్ని పరిశీలించారు. విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వహించవద్దని, తక్షణమే ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్