హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్సై రాజు కుమార్‌పై ఓ మహిళను మోసం చేసినందుకు సంచలన కేసు నమోదైంది. నాలుగేళ్ల క్రితం భర్త వేధింపులపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితురాలికి న్యాయం చేస్తానని నమ్మించి, విడాకులు ఇప్పించి, ఆపై పెళ్లి చేసుకుంటానని లైంగిక దోపిడీకి పాల్పడినట్లు సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. బాధితురాలు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా నిరాకరించడమే కాకుండా, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు Cr. No 252/26 కింద, BNS సెక్షన్లు 69, 89, 351(2) ప్రకారం కేసు నమోదు చేశారు.