వరంగల్ లో జరిగిన 'రైతు సంగ్రామ సదస్సు'లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను బూటకమని విమర్శించారు. 34 హామీలిస్తే ఒక్కటీ అమలు కాలేదని, రైతుల రక్తం తాగిన కాంగ్రెస్ ను రైతులు నమ్మి మోసపోయారని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు కూలీలకు రూ.12వేలు, పంట బీమా పథకం, అసైన్డ్ భూములకు పట్టాలు వంటి హామీలపై ఆయన ప్రశ్నలు సంధించారు.