ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం: కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

706చూసినవారు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం: కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. గత పాలకులు విస్మరించిన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండు రోజుల్లోనే పరిష్కరించి, కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిందని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారీగా కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్