రూ. 1. 20 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణం

0చూసినవారు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 5వ డివిజన్ కొత్తూరులో రూ. 30 లక్షలు, 49వ డివిజన్ జూలైవాడ, రెవెన్యూ కాలనీల్లో రూ. 1.20 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని మౌలిక సదుపాయాల పరంగా పూర్తిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ పనుల ద్వారా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

సంబంధిత పోస్ట్