వరంగల్ పశ్చిమ/హనుమకొండలోని హనుమాన్ నగర్ ఫేజ్-2లో వినాయక చవితి ఏడవ రోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ పొతుల శ్రీమాన్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న హాజరై పూజలు చేశారు. వినాయక విగ్రహాన్ని ఆర్డీఓ వెంకన్న విరాళంగా అందించగా, విద్యుత్ దీపాలంకరణను అమర్నాథ్ అందించారు. కాలనీ ప్రెసిడెంట్ చిర్ర రమేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు, చిన్నారులు పాల్గొని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నప్రసాదం స్వీకరించారు.