హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు సోమవారం ప్రారంభమైంది. మంత్రి కొండా సురేఖ ఈ లెక్కింపును ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు 500 మంది ఆధ్వర్యంలో 788 హుండీలలోని కానుకలను లెక్కిస్తున్నారు. గత జాతరలో 540 హుండీలలో 13.25 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.