హనుమకొండలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కోర్ట్ గణేష్ శోభాయాత్ర వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ (వెస్ట్), వరంగల్ (ఈస్ట్) ప్రాంతాల నుండి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల పటిష్ట బందోబస్తు, అధికారుల సమర్థవంతమైన ఏర్పాట్ల మధ్య ఈ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది.