వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, 100 కిలోల గంజాయి అక్రమ రవాణా కేసులో ఐదుగురు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ మల్లారెడ్డిని అభినందించి, రివార్డును అందజేశారు. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు సమన్వయంతో పనిచేస్తే నిందితులకు కఠిన శిక్షలు పడతాయని సీపీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కేసులో పీపీ రాజ మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారు.