సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అరెస్ట్

880చూసినవారు
హనుమకొండలో పేదలకు ఇళ్ల పట్టాలు, పక్కా గృహాల నిర్మాణ డిమాండ్ తో శనివారం వామపక్షాలు కలెక్టరేట్ ను ముట్టడించాయి. ఏకశిలా పార్క్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను తరలిస్తుండగా కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకోవడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్