కరెంట్ షాక్ తో కట్టర్ మృతి.. ధర్నా

1చూసినవారు
కరెంట్ షాక్ తో కట్టర్ మృతి.. ధర్నా
గ్రేటర్ వరంగల్ ఎన్డీసీఎల్ పరిధిలోని హనుమకొండ యాదవ నగర్ యూనిట్లో క్యాజువల్ కట్టర్ గా పనిచేస్తున్న గాదె పున్నంచందర్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. నక్కలగుట్ట లోని విద్యుత్ భవన్ ముందు పున్నం మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. గుండ్లసింగారం బీసీ కాలనీ వద్ద మరమ్మతుల పేరుతో విద్యుత్ సరఫరా అవుతున్న పోల్ ను అధికారులు ఎక్కించారని ఆరోపించారు. కరెంట్ షాక్ వల్ల కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో నగరంలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి చేతులు దులుపేసుకున్నారని ధర్నా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్