వరంగల్, హనుమకొండ పరిధిలో రాత్రి 10:30 తర్వాత హోటల్స్, షాప్స్, వ్యాపార సముదాయాలు తెరవకూడదనే నిబంధనలు విధించారు. అయితే, వరంగల్ మండి బజారులోని ఖుర్షీద్ హోటల్ కు ఈ నిబంధనలు వర్తించనట్లు తెలుస్తోంది. వారు రోడ్లపైనే ద్విచక్ర వాహనాలపై అమ్ముతున్నారు. సీపీ విధించిన నిబంధనలు సాధారణ ప్రజలకేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనతో నిబంధనల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.