వయో వృద్ధులకు తగిన ప్రాధాన్యతను తప్పనిసరిగా ఇవ్వాలని హనుమకొండ డిఆర్వో వై. వి. గణేష్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి గురువారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందించాలన్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటప్పుడు వయోవృద్ధులకు కేటాయించిన సీట్లలో వారే కూర్చునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.