అమ్మవారిపేటలో అగ్నిప్రమాదం

5చూసినవారు
అమ్మవారిపేటలో అగ్నిప్రమాదం
బట్టుపల్లి అమ్మవారిపేట దామెర గుట్టల్లో శ్రీ సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా సారలమ్మ అమ్మవారిని తీసుకువస్తున్న సమయంలో టపాసులు కాల్చడం వల్ల పక్కనే ఉన్న గుట్టలో తారజువ్వాళ్ళు పడి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది రవీందర్, వినోద్, వంశీ చాకచక్యంగా వ్యవహరించి, పెద్ద ప్రమాదం జరగకుండా మంటలను ఆర్పివేశారు. వారిని సీఐ రమేష్, ప్రశాంత్ రెడ్డి అభినందించారు.

సంబంధిత పోస్ట్