వరంగల్ పోలీస్ విభాగంలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి, నేడు పదవీ విరమణ పొందుతున్న పోలీసు అధికారులను అడిషనల్ డీసీపీ ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ అనంతరం సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సమ్మయ్య, శివకుమార్, ఆర్ఎస్ఐ ఏ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుళ్లు కే. సంపత్ రెడ్డి, జి వెంకటయ్య, పి సదానందం వంటివారు పాల్గొన్నారు.