
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. నేటి నుంచి కొత్త రూల్స్
నూతన సంవత్సరం 2026 ప్రారంభం కానున్న నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు కీలక సూచన చేసింది. జనవరి 1 నుంచి అమలులోకి రానున్న కొత్త మార్గదర్శకాల ప్రకారం, నిబంధనలు పాటించని, ఎక్కువకాలంగా వినియోగంలో లేని బ్యాంకు ఖాతాలపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డిజిటల్ మోసాలను నియంత్రించి, భద్రతను పెంచడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని RBI తెలిపింది.




