రూ. 1. 64 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

1732చూసినవారు
వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి 62వ డివిజన్‌లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో రూ. 50 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నాయని గుర్తించి, వెంటనే అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. డివిజన్ పర్యటనల ద్వారా నూతన అభివృద్ధికి నాంది పలుకుతూ, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్