అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో హన్మకొండలో ఇంధన కొరత తీవ్రమైంది. సోమవారం పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కట్టారు. డీజిల్ నిల్వలు నిండుకోవడంతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం లభించక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి సరఫరాను పునరుద్ధరించాలని, ఇంధన కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. గోయిండ్ల ప్రశాంత్ ఈ పరిస్థితిని వివరించారు.