న్యాయవాదుల ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

5చూసినవారు
న్యాయవాదుల ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో, వరంగల్ (వెస్ట్), వరంగల్ (ఈస్ట్) బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉపేందర్, రామకృష్ణ గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వారు అందించిన సేవలు, సత్యం, అహింస, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్