గాంధీజీ సిద్ధాంతాలు సమాజానికి ఆదర్శం.. జడ్జి చంద్రప్రసన్న

2చూసినవారు
గాంధీజీ సిద్ధాంతాలు  సమాజానికి ఆదర్శం.. జడ్జి చంద్రప్రసన్న
వరంగల్, గొర్రెకుంటలోని ఆనంద ఆశ్రమంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి. వి. వి. చంద్రప్రసన్న, విశిష్ట అతిథిగా రిటైర్డ్ ప్రొఫెసర్ కె. విజయబాబు హాజరయ్యారు. గాంధీజీ అహింస, సత్య మార్గాలు నేటి సమాజానికి ఆదర్శమని జడ్జి చంద్రప్రసన్న పేర్కొన్నారు. అనంతరం ఆశ్రమవాసులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, సీనియర్ సిటిజన్లు, సిబ్బంది, ఆశ్రమవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్