
వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి
TG: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఖైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి, కోళ్ల ఫారం షెడ్లో రాత్రి డ్యూటీ చేస్తుండగా, మంగళవారం రాత్రి పొరపాటున నీళ్ల బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని సేవించాడు. తీవ్ర కడుపు మంటతో బాధపడటంతో సహోద్యోగులు అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు.




