పోపా ప్రతిభా పురస్కారాలకు కన్వీనర్ గా గోషికొండ సుధాకర్

1379చూసినవారు
పోపా ప్రతిభా పురస్కారాలకు కన్వీనర్ గా గోషికొండ సుధాకర్
ఉమ్మడి వరంగల్ జిల్లా పోపా ఆధ్వర్యంలో పద్మశాలి ప్రతిభా పురస్కారాలు–2026 కార్యక్రమాన్ని అక్టోబర్ 25న వరంగల్‌లోని శివనగర్ పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం జరిగిన సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థుల నుంచి సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గోషికొండ సుధాకర్‌ను కార్యక్రమ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పురస్కారాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. పోపా అధ్యక్షుడు గుండు కామేశ్వర్ రావు, కార్యదర్శి పాము శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్‌తో పాటు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్