హన్మకొండ: హనుమాన్ నగర్ కాలనీలో అర్చ్ ప్రారంభం

62చూసినవారు
హన్మకొండ: హనుమాన్ నగర్ కాలనీలో అర్చ్ ప్రారంభం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పోచమ్మకుంటలో హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన స్వాగత తోరణం (అర్చ్) ను మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీ వాసులు స్వచ్ఛందంగా కలసి చేపట్టిన ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రశంసనీయమని అన్నారు. కాలనీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్