హనుమకొండ జిల్లా వడ్డేపల్లి పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2, 4, 6వ సెమిస్టర్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. రెండో సెమిస్టర్ 50. 50%, నాల్గో సెమిస్టర్ 65. 53%, ఆరో సెమిస్టర్ 94. 75% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా ఫాకల్టీని ఆయన అభినందించారు.