హనుమకొండ కోర్టుకు నాలుగవ సారి బాంబు బెదిరింపు

1చూసినవారు
హనుమకొండ జిల్లా కోర్టుకు బాంబ్ బెదిరింపు రావడంతో కోర్టు సిబ్బంది అప్రమత్తమై కక్షిదారులను బయటకు పంపించారు. పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, జాగిలాలతో కలిసి కోర్టు ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించగా, ఎటువంటి బాంబు కనుగొనబడలేదు. ఇది కేవలం బెదిరింపు చర్యగా నిర్ధారించారు. దీంతో రెండు గంటల పాటు కోర్టు కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత రెండు నెలల్లో ఇది నాలుగోసారి ఇలాంటి బెదిరింపులు రావడం, దీనిపై పోలీసులు సత్వర చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్