ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు పెరుమాండ్ల రాములు (34) తాటి చెట్టుపై నుంచి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.