హనుమకొండలో జోరు వాన

2చూసినవారు
హనుమకొండ నగరంలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వీధుల్లో వరద పోటెత్తడంతో పాటు మురుగు కాల్వలు ఉప్పొంగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, ఎన్జీవోస్ కాలనీ, గోకుల్నగర్ కూడలి, అంబేడ్కర్ భవనం, ఇందిరానగర్ మార్గాల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది.

ట్యాగ్స్ :