ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాదాయ భూములను అక్రమార్కుల చెర నుండి రక్షించాలని హిందూ సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హన్మకొండ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, దేవాదాయ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని కోరారు. అక్రమార్కులకు సహకరిస్తున్న ఎండోమెంట్ అధికారులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయ ఆస్తుల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివాజీ సేన జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.