మేడారం మహాజాతర సందర్భంగా, హనుమకొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రకటించిన సెలవుకు బదులుగా ఫిబ్రవరి 14వ తేదీని పనిదినంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.