పార్టీలకు అతీతంగా అర్హులకే ఇళ్లు ఇవ్వాలి.. బీజేపీ నేత

1761చూసినవారు
పార్టీలకు అతీతంగా అర్హులకే ఇళ్లు ఇవ్వాలి.. బీజేపీ నేత
ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించి, అధికార పార్టీ నాయకులకు, ఆర్థికంగా స్థిరపడిన వారికి ప్రాధాన్యతనిచ్చారని బీజేపీ నేత పెరుమాండ్ల వెంకటేశ్వర్లు మంగళవారం ఆరోపించారు. ఈ మేరకు ఆయన హన్మకొండ కలెక్టర్, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి, రెండో విడతలోనైనా పార్టీలకు అతీతంగా కేవలం అర్హులైన నిరుపేదలకే ఇళ్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్