కాజీపేటలో భారీ గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్

1303చూసినవారు
కాజీపేటలో భారీ గంజాయి పట్టివేత, ఇద్దరు అరెస్ట్
హనుమకొండ జిల్లా కాజీపేటలో పోలీసులు 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కడిపికొండ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన బొల్ల ప్రవీణ్ కుమార్, మొహమ్మద్ అఫ్టాల్ పాషాలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు వాహనం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్