హన్మకొండ జిల్లా ఐనవోలు మండల వ్యాప్తంగా జూలై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా నేతలు అన్నారు. ఆదివారం ఐనవోలులో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఇన్ ఛార్జ్ సోమన్న, కో-ఇన్ ఛార్జ్ సోమశేఖర్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కుమార్, మండల నేతలు ఉన్నారు.