హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నారు. రైతు సంగ్రామ సదస్సుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై కేటీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కల్లాల వద్ద పంటలు కొంటున్నామని చెబుతున్నారని, కానీ కొనుగోళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి 'పాలన తెలియదా, మేము ఏమైనా హౌలా గాళ్ళమా' అని అన్న మాటలను గుర్తు చేశారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుకలు చీరుస్తామని హెచ్చరించారు.