కుడా భూముల వేలంపై బీఆర్ఎస్ ఆరోపణలకు ఇనగాల కౌంటర్

64చూసినవారు
కుడా భూముల వేలంపై బీఆర్ఎస్ ఆరోపణలకు ఇనగాల కౌంటర్
వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 150 కోట్ల కుడా భూమి కబ్జా, కాళోజీ కళాక్షేత్రం టెండర్లలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని, అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఓపెన్ ఆక్షన్ ద్వారా కుడాకు ఆదాయం తెస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్