రైతు స‌భ నిర్వ‌హ‌ణ‌కు స్థ‌లాల ప‌రిశీల‌న‌

10చూసినవారు
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పేరుతో చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు హనుమకొండలోని కేడీసీ, కుడా, ఆర్ట్స్ కళాశాల మైదానాలను పరిశీలించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్