అంతర్ రాష్ట్ర (తమిళనాడు) చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

8చూసినవారు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను వరంగల్ సిసిఎస్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. కళ్యాణ సుందరం, సెల్వరాజ్ అనే నిందితుల నుండి 15.20 లక్షల రూపాయల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగలు ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్