తెలంగాణ రాజకీయాల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కొత్త సమీకరణాలపై దృష్టి సారించాయి. చదువుకున్న, యువత ప్రాతినిధ్యం వహించే ఈ స్థానంలో రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను కాపాడగల సమర్థుడైన నాయకుడు చట్టసభకు వెళ్లాలనే ఆకాంక్ష పట్టభద్రుల్లో బలంగా ఉంది. హనుమకొండకు చెందిన పేరం గోపిక్రిష్ణ అర్హుడని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో
బీజేపీ అభ్యర్థి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.