విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం ఎవరి తరం కాదు

1328చూసినవారు
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన 'చలో రాజ్ భవన్' ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ అణచివేత చర్యలు, పోలీసు ఆంక్షలను ఎదుర్కొని రాజ్ భవన్ ముట్టడిని విజయవంతం చేశామని అన్నారు.

సంబంధిత పోస్ట్