రాష్ట్ర ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మే 5న వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్షను విజయవంతం చేయాలని జిల్లా చైర్మన్ గజ్జల రామ్ కిషన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర జేఏసీ పరిశీలకులు దాస్య నాయక్ సమక్షంలో టీఎన్జీవోస్ భవన్‌లో జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు నాలుగు ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు.