వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో PG పరీక్షల రీకౌంటింగ్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో, ఎగ్జామినేషన్ బ్రాంచ్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ పరిణామాలతో మనస్థాపానికి గురైన వీసీ నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈ రాజీనామాను ఆమోదించారు. ఈ సంఘటనతో పలువురు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.