గతంలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగలపై నిఘా పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సిసిఎస్ పోలీసులకు పిలుపునిచ్చారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సిటీ క్రైమ్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించిన అనంతరం సీపీ పాత నేరస్తుల ఫోటోలను, స్టేషన్ రికార్డులను పరిశీలించి, చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.