నవంబర్ 7, 8, 9 తేదీలలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో 58వ సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళల జట్టు గత వారం రోజులుగా రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోచింగ్ క్యాంపులో శిక్షణ పొందుతోంది. ఈ క్యాంప్ కు గోగు నారాయణ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.