విశ్రాంత ఐపిఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రచించిన ‘‘పుంజు తోక’’ సంపుటి అవిష్కరణ ఆదివారం హన్మకొండలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ మాట్లాడుతూ, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి రచనలు సామాజికంగా మార్పు కలిగించే విధంగా వున్నాయని తెలిపారు. అంపశయ్య నవీన్ చేతుల మీదుగా ఈ సంపుటి అవిష్కరించబడింది. మిత్ర మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.