పెద్దపల్లి జిల్లా మల్కాపూర్ కు చెందిన పల్లకొండ రాజ్ కుమార్ ను అరెస్ట్ చేసి, 50 వేల విలువైన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ కేయూ సీఐ రవికుమార్ తెలిపారు. గత సంవత్సరం 2025 అక్టోబర్ నెలలో పెగడపల్లి డబ్బాల వద్ద జరిగిన ఆటో దొంగతనం కేసులో, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నేరస్తుడిని పట్టుకుని, ఆటోను రికవరీ చేసి రిమాండ్ కు పంపించారు.