వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ ఆఖరి సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో మహిళా స్టాళ్ల నిర్మాణానికి మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాగరాజు, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెసారయ్య, ఎంపీ కడియం కావ్య, కార్పొరేటర్లు భూమి పుజా చేశారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో ఏజెండా అంశాలపై చర్చ మొదలైంది. అధికారులు పాల్గొన్నారు.