రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు నిరసనగా, గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా, వరంగల్ (వెస్ట్) కోర్టు సముదాయం ఎదుట న్యాయవాదులు భారీ నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుదీర్, పులి సత్యనాయణ ఆధ్వర్యంలో న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.