ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా లెనిన్ వత్సల్ టోప్పో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ములుగు కలెక్టర్ దివాకర్ టీఎస్ ఇన్‌ఛార్జ్ పీవోగా వ్యవహరించారు. నిన్న జరిగిన బదిలీల్లో మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న లెనిన్ వత్సల్ టోప్పోను ప్రభుత్వం పీవోగా నియమించింది.