దేవాలయ భూముల కబ్జా కేసులో అధికారుల గైర్హాజరుపై లోకాయుక్త ఆగ్రహం

6చూసినవారు
దేవాలయ భూముల కబ్జా కేసులో అధికారుల గైర్హాజరుపై లోకాయుక్త ఆగ్రహం
వరంగల్ దేశాయిపేట్ రంగనాయక దేవాలయానికి చెందిన 19-19 గుంటల భూమి కబ్జాపై తెలంగాణ లోకాయుక్త విచారణ చేపట్టింది. ఈ కేసులో దేవాదాయ శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో లోకాయుక్త న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. తదుపరి విచారణకు భూమిని సర్వే చేసి, పూర్తి నివేదికతో వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ లు వ్యక్తిగతంగా హాజరు కావాలని మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణలో రాష్ట్రీయ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్