పెళ్లి వాహనాన్ని ఢీకొన్న లారీ... ముగ్గురు మృతి

0చూసినవారు
హనుమకొండ జిల్లా ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సైదాపురం గ్రామానికి చెందిన 21 మంది పెళ్లి తంతు ముగించుకుని బొలేరో వాహనంలో సిద్దిపేట నుంచి తిరిగి వస్తుండగా, గోపాలపురం వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్