తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, గత 12 ఏళ్లుగా అత్యంత నిరాదరణకు గురైన వర్గం జర్నలిస్టులేనని జర్నలిస్టులు తెలిపారు. ప్రభుత్వ వైఖరిపై 33 జిల్లాల్లోని జర్నలిస్టుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన ధర్నాలో వరంగల్ జర్నలిస్టులు పాల్గొన్నారు.